జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » లాల్‌గఢ్: లొంగిపోయిన 700 మంది నక్సల్స్ (Naxals | Lalgarh | Court arrest | Darjeeling)
 
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో సోమవారం సీబీఐ- ఎంఎల్ (లిబరేషన్) వర్గానికి చెందిన 700 మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా కోర్టులో లొంగిపోయారు. లాల్‌గఢ్ ప్రాంతం నుంచి భద్రతా దళాలను వెంటనే ఉపసంహరించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

డార్జిలింగ్ జిల్లా సీపీఐ- ఎంఎల్ కార్యదర్శి చారు మజుందెర్ నేతృత్వంలో 700 మంది కార్యకర్తలు సిలిగురి కోర్టులో లొంగిపోయారని అధికారిక వర్గాలు తెలిపాయి. అరెస్టు అయిన అందరూ వ్యక్తిగత పూచీకత్తుపై వెంటనే విడుదలయ్యారని ఇన్‌స్పెక్టర్ ఇన్- ఛార్జి ప్రభాత్ చక్రవర్తి విలేకరులతో చెప్పారు.

లాల్‌గఢ్‌లో భద్రతా దళాలు ఉండటం స్థానికులను ఇబ్బందిపెడుతోందని లొంగిపోయిన నక్సల్స్ ఈ సందర్భంగా ఆరోపించారు. చారు తండ్రి, నక్సలైట్ ఉద్యమ సృష్టికర్త అభిజిత్ మంజుదెర్ వార్తా సంస్థలతోపాటు.. భద్రతా దళాలు ఇక్కడ ఉండటం వలన నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి స్థానికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

లాల్‌గఢ్ నుంచి సంయుక్త దళాలను ఉపసంహరించడంతోపాటు, పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహార ధాన్యాల వంటి నిత్యావసర వస్తువులను సబ్సిడీపై సరఫరా చేయాలని అభిజిత్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.