జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » పూణే నగరంలో మరో స్వైన్ ఫ్లూ రోగి మరణం (Swine flu | Pune | Viral infection | IMA)
 
పూణే నగరంలో మరో స్వైన్ ఫ్లూ రోగి మృతి చెందాడు. దీంతో నగరంలో ఇప్పటివరకు ఈ ప్రమాదకర వైరస్ బారినపడి మృతి చెందినవారి సంఖ్య 34కి చేరుకుంది. దేశంలోనే అత్యుధికంగా స్వైన్ ఫ్లూ మరణాలు పూణేలో సంభవించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ నగరంలో స్వైన్ ఫ్లూ మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా స్వైన్ ఫ్లూతో మృతి చెందినవారి సంఖ్య 200 దాటింది. తాజాగా సందీప్ డేనే అనే 35 ఏళ్ల వ్యక్తి స్వైన్ ఫ్లూతో గత రాత్రి పూణేలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుముశాడు. సందీప్ ఆగస్టు 28న స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు.

ఇదిలా ఉంటే పూణేలో మరో ఆరు కొత్త స్వైన్ ఫ్లూ కేసులు వెలుగుచూశాయని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అనుమానిత స్వైన్ ఫ్లూ కేసులకు చికిత్స అందించేందుకు పూణే పరిసరాల్లోని గ్రామీణ ప్రాంత వైద్యులకు వర్క్‌షాప్ నిర్వహించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నగర బ్రాంచ్ నిర్ణయించింది.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.