జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » మొన్న మటన్ బిరియాని.. నేడు.. బాస్మతి రైస్: కసబ్ (Ajmal Kasab | 26/11 case | Mutton Biriyani | Basmati rice |)
 
File
FILE
దేశ వాణిజ్య రాజధాని ముంబైపై దాడికి తెగబడి సజీవంగా పట్టుబడిన తీవ్రవాది అజ్మల్ కసబ్‌కకు బాస్మతి బియ్యంతో వండిన భోజనం కావాలని కోరుతున్నాడు. ఇటీవల మటన్ బిర్యానీ కావాలని కోరిన కసబ్.. తాజాగా బాస్మతి బియ్యంతో చేసిన భోజనం కావాలని కోరడం గమనార్హం.

ప్రస్తుతం ముంబైలోని ఆర్థుర్ జైలులో తీవ్రవాది అజ్మల్‌ను బంధించి ఉన్న విషయం తెల్సిందే. దీనిపై జైల్ సూపరింటెండ్ రాజేంద్ర ధామ్నే సోమవారం మాట్లాడుతూ.. గత వారం బాస్మతి బియ్యం కావాలని డిమాండ్ చేశాడని, అంతకుముందు మటన్ బిర్యానీ కోరాడని గుర్తు చేశాడు.

కసబ్ మనస్సు రోజుకో విధంగా మారుతోందని, అందువల్ల అతన్ని మేం నిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. గతంలో జైలు సిబ్బంది అందించే అన్నాన్ని ఆరగించకుండా, అన్నం ప్లేటులను తోసివేసిన వియం తెల్సిందే.

అంతేకాకుండా, సమయానికి కోర్టుకు వచ్చేందుకు సమయానికి దుస్తులు కూడా వేసుకోకుండా జాప్యం చేస్తున్న విషయం తెల్సిందే. కాగా, కసబ్‌పై నమోదైన కేసులను విచారించేందుకు ఆర్థుర్ జైలులోనే ప్రత్యేక కోర్టును ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.

కసబ్ ఉండే ప్రత్యేక గదిలో కెమరాలు ఏర్పాటు చేసి, అతని ప్రతి కదలికను నిశితంగా గమనిస్తున్నారు. అంతేకాకుండా, కసబ్‌కు జైలు గార్డులతో పాటు.. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు భద్రతను కల్పిస్తున్న విషయం తెల్సిందే.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.