జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » నేడు సమావేశం కానున్న కాంగ్రెస్ కోర్ కమిటీ (Congress | Core Committy | Friday | PM | Manmohan Singh | Ifthar Dinner)
 
కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు న్యూఢ్లిల్లీలో సమావేశం కానుంది.

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం కానుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

కోర్ కమిటీ సమావేశంలో ప్రధానంగా దేశంలోని మూడు రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై చర్చ జరిగే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపారు.

ఇదిలావుండగా ఈ సమావేశానంతరం ప్రధాని ఇంట్లో సాయంత్రం ఆరున్నర గంటలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.

కాగా ఈ ఇఫ్తార్ విందుకు పలువురు అగ్రనాయకులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు హాజరౌతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.