జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » సరిహద్దులో ఉద్రిక్తత: జవాన్లపై కాల్పులు (Jammu | LOC | BSF | Pakistan | Militents)
 
జమ్ము-కాశ్మీరులోని భారత్-పాక్ సరిహద్దులో భారత జవాన్లపై పాకిస్తాన్ భూభాగం నుంచి కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు తీవ్ర గాయాలపాలయ్యారు. శుక్రవారం ఉదయం ఆరున్నర గంటలకు జమ్ము- కాశ్మీరులోని ఇల్యాస్ పోస్టు వద్ద సరిహద్దు ఫెన్సింగ్‌ను తనీఖీ చేస్తున్న సమయంలో పాకిస్తాన్ వైపు నుంచి బీఎస్ఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపినట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఏకె సరోలియా వెల్లడించారు.

గురువారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత పాక్ భూభాగం నుంచి భారతదేశంలోకి చొరబడేందుకు నలుగురు మిలిటెంట్లు యత్నించడంతో భారత జవాన్లు వారిపై కాల్పులు జరిపారు. భారత జవాన్లపై మిలిటెంట్లు తిరిగి కాల్పులకు తెగబడ్డారు. ఈ సంఘటన జరిగిన తర్వాత కాల్పులు జరిపిన ప్రాంతాన్ని బీఎస్ఎఫ్ దళ అధికారి పరిశీలించారు.

ఇదిలావుండగా పాకిస్తాన్ సరిహద్దు వెంబడి కాల్పులతోపాటు చైనా సరిహద్దు ప్రాంతంలో సైతం ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి దళాలను మరింత అప్రమత్తం చేసినట్లు బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.