జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్: 15 మంది నక్సల్స్ మృతి (Chattisgarh | Encounter | Naxals | Police | Khammam)
 
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో 15 మంది నక్సల్స్‌తో పాటు.. ముగ్గురు పోలీసులు మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం. ఖమ్మ జిల్లా సరిహద్దుల్లోని కిష్టారం అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

కిష్టారం అడవుల్లో నక్సలైట్లు సమావేశమైనట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ప్రత్యేక పోలీసు దళం కిష్టారం అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టి, నక్సలైట్లు సమావేశమైన ఆచూకీని కనుగొన్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన నక్సలైట్లు పోలీసులపై కాల్పులకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య భీకర స్థాయిలో కాల్పులు జరిగాయి.

ఆధునిక ఆయుధ సామాగ్రి కలిగిన పోలీసులు జరిపిన కాల్పుల్లో 15 మంది నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ప్రాణ భయంతో తప్పించుకుని పారిపోయారు. వీరికోసం హెలికాఫ్టర్లతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నక్సలైట్లు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృత్యువాత పడ్డారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.