ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » కోర్టు తీర్పు తర్వాతే 'సేతు' ప్రాజెక్టుకు మోక్షం: వాసన్ (Ramasethu Project | Minister GK Vasan | Supreme court)
కోర్టు తీర్పు తర్వాతే 'సేతు' ప్రాజెక్టుకు మోక్షం: వాసన్
శుక్రవారం, 18 సెప్టెంబర్ 2009( 16:04 IST )
WD
WD
దక్షిణ భారతావనికి ఎంతో మేలు చేకూర్చే రామసేతు ప్రాజెక్టును సుప్రీం కోర్టు తీర్పు తర్వాత పూర్తి చేస్తామని కేంద్ర నౌకాయాన శాఖామంత్రి జీకే.వాసన్ అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై పూర్తి వివరాలు అందించడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యపడదని చెప్పారు.
దీనిపై ఆయన శుక్రవారం చెన్నయ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సేతు సముద్ర ప్రాజెక్టు పూర్తయితే దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాలకు ఎంతో లాభం చేకూరుతుందన్నారు. ప్రధానంగా తమిళనాడుకు కలిగే ప్రయోజనాలు అధికంగా ఉన్నాయని చెప్పారు.
ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న వారు రామసేతు వారధిని అడ్డుపెట్టుకుని కోర్టుకు వెళ్లారన్నారు. అందువల్ల ఇది సుప్రీం కోర్టు తీర్పు మేరకు పూర్తవుతుందన్నారు. అంతకుముందు.. ఎన్నూరు పోర్టు ట్రస్ట్ మంత్రి జీకే.వాసన్‌కు 4.15 కోట్ల రూపాయల డివిడెండ్ చెక్కును ఈపీఎల్ ఛైర్మన్ ఎస్.వేలుస్వామి అందజేశారు.
ఈ సందర్భంగా వేలుస్వామి మాట్లాడుతూ.. 2009 మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఈపీఎల్ 41.46 కోట్ల రూపాయల ఆదాయాన్ని అర్జించినట్టు చెప్పారు. దీంతో షేర్ హోల్డర్లకు 15 శాతం మేరకు డివిడెండ్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు.