జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » 2011-12 నాటికి క్రైమ్ ట్రాకింగ్ నెట్‌వర్క్: చిదంబరం (Crime tracking network system | Chidambaram | Indians)
 
File
FILE
వచ్చే 2011-12 సంవత్సరం నాటికి క్రైమ్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్‌ను అందుబాటులోకి తేనున్నట్టు కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం తెలిపారు. దేశంలోని 16 వేల పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసే ఈ వ్యవస్థ కోసం రెండు వేల కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్టు ఆయన తెలిపారు. దీనివల్ల అన్ని రకాల ఉగ్రవాద కార్యకలాపాలపై ఏకకాలంలో స్పందించవచ్చని తెలిపారు.

దీనిపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే యేడాది నాటికి మల్టీ పర్పస్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్స్ (ఎంఎన్ఐసి) కార్డులను 1.1 బిలియన్ మందికి అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్ ఏర్పాటుపై కూడా కృషి చేస్తున్నట్టు చెప్పారు.

దీనివల్ల దేశంలోని 16 వేల పోలీసు స్టేషన్లను అనుసంధానం చేస్తామన్నారు. ఫలితంగా.. ఒక స్టేషన్ సిబ్బంది మరో స్టేషన్‌ సిబ్బందితో సంప్రదింపులు జరుపవచ్చన్నారు. ఈ ప్రాజెక్టు వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అన్ని రాష్ట్రాల్లో నోడల్ ఆఫీసర్లను నియమించామన్నారు.

వీరంతా కేంద్ర ప్రభుత్వంపై ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. ఒక్కసారి సీసీటీఎన్ఎస్‌ అమల్లోకి వస్తే.. దేశ అంతర్గత భద్రతలో ఉత్పన్నమయ్యే ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవచ్చని అభిప్రాయపడ్డారు. అలాగే, నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టెక్నోక్రాట్స్‌ తన వంతు సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.