జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన సైన్యం (Security forces | terrorism | arms | Jammu | Doda | Riyasi)
 
జమ్మూ సరిహద్దుల్లోని డోడా, రియాసీ జిల్లాలోనున్న ఉగ్రవాదుల స్థావరాలను దేశీయ భద్రతా దళాలు హతమార్చాయి. అక్కడున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రితోపాటు 13 గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు.

దేశీయ భద్రతా దళాలు, పోలీసు గస్తీ దళాలు రియాసీ జిల్లాలోని మేహోర్ తాలూకాలోనున్న ఓ ప్రకృతి సిద్ధమైన గుహలో ఉగ్రవాదులు తమ స్థావరాలను ఏర్పరచుకుని ఉన్నారని భద్రతా దళాధికారులు తెలిపారు.

తాము ఉగ్రవాద స్థావరాలనుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో రెండు రాకెట్ లాంచర్లు, అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లకు చెందిన ఆరు గ్రెనేడ్లు, ఐదు చేతి బాంబులు, రెండు డిటోనేటర్లు, మ్యాగజైన్లు తదితర వస్తువులున్నట్లు వారు పేర్కొన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.