ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » జీహెచ్‌లో విజయవంతమైన గుండె మార్పిడి శస్త్ర చికిత్స (Tamilanadu | Chennai | GGH | Dean | Mohana Sundaram | Heart Operation,)
జీహెచ్‌లో విజయవంతమైన గుండె మార్పిడి శస్త్ర చికిత్స
శనివారం, 19 సెప్టెంబర్ 2009( 13:35 IST )
తమిళనాడులోని చెన్నైలో ఓ యువతికి ప్రభుత్వ ఆసుపత్రి(జీజీహెచ్)లో గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ప్రత్యేక శస్త్ర చికిత్స చేయటం తమ రాష్ట్రంలోనే ఇది తొలిసారని జీజీహెచ్ డీన్ డాక్టర్. మోహన సుందరం సంతోషం వెలిబుచ్చారు.
హృద్రోగ నిపుణులైన విశ్వకుమార్ నేతృత్వంలోని వైద్యబృందం శుక్రవారంనాడు దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారని మోహన సుందరం వెల్లడించారు.
ఇటీవల ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన ఓ యువకుని గుండెను సదరు యువతికి మార్పిడి చేశామని ఆయన తెలిపారు.
ఇదిలావుండగా గుండె మార్పిడి శస్త్రచికిత్సలో ప్రభుత్వ వైద్యులు ఎంతో నేర్పుతో వ్యవహరించారని, ఇది తమ రాష్ట్రానికే గర్వకారణమని తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కొనియాడారు.
దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి శస్త్రచికిత్స చేయటం ఇదే మొదటిసారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి తన శుభాకాంక్షలు తెలిపారు.
కాగా ప్రస్తుతం ఆ యువతి కోలుకుంటోందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.