వచ్చే అక్టోబరు నెలలో జరుగనున్న మూడు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ శనివారం నుంచి ఆరంభంకానుంది. ఈ నామినేషన్ దాఖలు ప్రక్రియ ఈనెల 25వ తేదీతో ముగుస్తుంది.
మహారాష్ట్ర, హర్యానా, అరుణాచల్‌ప్రదేశ్‌లలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం శుక్రవారం నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. నామినేషన్ల దాఖలు నుంచి ఓట్ల లెక్కింపు వరకు తేదీలను ఖరారు చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 19వ తేదీ నుంచి దాఖలు చేస్తారు.
వీటిని సమర్పించేందుకు ఈనెల 25వ ఆఖరు తేది. అలాగే, నామినేషన్లు ఉపసంహరణకు ఈనెల 29వ తేదీ వరకు గడువు ఉంది. మూడు రాష్ట్రాలకు పోలింగ్ అక్టోబరు 13వ తేదీన జరుగుతుంది. కాగా, మహారాష్ట్రలో 288 అసెంబ్లీ సీట్లు ఉండగా, హర్యానాలో 90 స్థానాలు, అరుణాచల్ ప్రదేశ్‌లో 60 సీట్లు ఉన్నాయి.