జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఎంపిక చేసిన మెడికల్ షాపుల్లో టామీఫ్లూ మందు (Tamiflu | Swineflu drug | Drugs | Doctor | New Delhi | Country)
 
File
FILE
దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న స్వైన్ ఫ్లూ మహమ్మారికి అడ్డుకట్ట వేసే టామీ ఫ్లూ మందులు మంగళవారం నుంచి దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. దేశంలో ఎంపిక చేసిన, గుర్తింపు పొందిన మెడికల్ షాపుల్లో ఈ మందుల రీటైల్ అమ్మకాలు జరుగనున్నాయి.

డ్రగ్స్-కాస్మాటిక్స్ చట్టం 1945లోని షెడ్యూల్ పదికి లోబడి ఓసెల్టామివిర్ ఫాస్పేట్ లేదా జనామివిర్ లేదా మరే ఇతర టామీ ఫ్లూ మందులను విక్రయించాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఈ మందును విక్రయించే ఫార్మాసిస్ట్‌లు ప్రిస్క్రిప్షన్ రికార్డులను, మందులను సూచించిన వైద్యుని పేరు, చిరునామా, కొనుగోలు చేసిన వ్యక్తి తదితర వివరాలను విధిగా సేకరించాల్సి ఉంటుంది.

ఈనెల 14వ తేదీన కేంద్ర ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఈ మందులను ఎంపిక చేసిన మెడికల్ షాపుల్లో అమ్మకాలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.

ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఈ వ్యాధికి 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు వైద్య శాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ మందు తయారీకి రాన్‌బాక్సీ, సిప్లా, మెట్కో, హెటీరో, స్టైడ్స్ అండ్ రోఛీ‌ వంటి ఆరు కంపెనీలకు మాత్రమే అనుమతి ఇచ్చారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.