జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » కాంగ్రెస్ అధినేత్రితో సమావేశమైన మంత్రి శశి థరూర్ (Shashi Tharoor | Sonia Gandhi | Twitter | Congress | PM | Cattle Class)
 
File
FILE
ఎకానమీ క్లాస్ విమాన ప్రయాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి శశి థరూర్ మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. తాను చేసిన వ్యాఖ్యలపై ఆయన స్వయంగా వివరణ ఇచ్చుకున్నారు. ఆఫ్రికా పర్యటనను ముగించుకుని స్వదేశానికి తిరిగొచ్చిన థరూర్.. ఢిల్లీకి వచ్చీ రాగానే సోనియాతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆర్థిక మాంద్య ప్రభావం కారణంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పొదుపు చర్యల్లో భాగంగా కేంద్ర మంత్రులందరూ ఎకానమీ క్లాసులోని విమాన ప్రయాణం చేయాలని సోనియా హుకుం జారీ చేశారు. ఇది శశి థరూర్‌కు ఆగ్రహం తెప్పించింది. ఆవుల మంద ప్రయాణించే ఎకానమీ క్లాసులో తాను కూడా ప్రయాణిస్తానని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. ఎకానమీ తరగతిలో ప్రయాణించే విమాన ప్రయాణికులను కించపరిచే విధంగా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. అంతేకాకుండా, ఆయనను మంత్రి వర్గం నుంచి తప్పించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది.

అలాగే, మంత్రి థరూర్ వ్యాఖ్యలపై సొంత పార్టీకి చెందిన కాంగ్రెస్ నేతలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన సోనియాతో సమావేశమై తన వివరణ ఇచ్చారు. అంతేకాకుండా, మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీ కానున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.