జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరు: కాంగ్రెస్ (Congress | LJP | RJD | National | Anil Sharma | Assembly Election)
 
బీహార్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బీహార్ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలైన ఆర్జేడీ, ఎల్జేపీలతో కలిసి పోటీ చేసేది లేదని రాష్ట్రశాఖ తేల్చి చెప్పింది.

దీనిపై కాంగ్రెస్ చీఫ్ అనిల్ శర్మ మంగళవారం మాట్లాడుతూ.. ముగిసిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తమ ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకున్నారన్నారు. అందువల్ల ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఎల్జేపీ చీఫ్ రామ్ విలాస్ పాశ్వాన్‌లతో కలిసి పోటీ చేయాల్సిన అవసరం లేదన్నారు.

అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతను ఆర్జేడీ, ఎల్జేపీ నేతలు గ్రహించడం పట్ల తాము సంతోషిస్తున్నామన్నారు. కాగా, బీహార్‌లో తాజాగా జరిగిన 18 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు సీట్లు గెలుచుకుంది. ఎల్జేపీ, ఆర్జేడీలు కలిసి తొమ్మిది సీట్లు కైవసం చేసుకోగా, బీఎస్పీ, స్వంతంత్ర అభ్యర్థి ఒక్కొక్కటి చోట గెలుపొందారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.