జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ముగింపు దశలో అద్వానీ రాజకీయ జీవితం: పారికర్ (Advani | Parrikar | Loksabha | BJP | Goa Ex CM | PM Candidate)
 
భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ రాజకీయ జీవితం ముంగిపు దశకు చేరుకుందని గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోపించారు. ఆయన పార్టీని మరో రెండుమూడు రోజులు మాత్రమే నడిపించే అవకాశం ఉందని ఆయన స్థానిక ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

సాధారణ ఎన్నికల్లో భాజపాకు ఘోర పరాజయం ఎదురైన విషయం తెల్సిందే. ఈ ఫలితాల అనంతరం అద్వానీపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. భాజపాకు చెందిన కొందరు సీనియర్ నేతలు అద్వానీని లక్ష్యంగా చేసుకుని బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల ఓటమికి అద్వానీయే నైతిక బాధ్యత వహించాలని పలువురు డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో మంగళవారం పారికర్ విమర్శలు చేశారు. అద్వానీ రాజకీయ జీవితం మరో రెండు మూడు సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత ఆయన పార్టీకి గార్డియన్ లేదా మార్గనిర్ధేశకుడిగా కొనసాగుతారన్నారు. పారికార్ చేసిన వ్యాఖ్యలతో వచ్చే 2014 ఎన్నికల్లో జరిగే సాధారణ ఎన్నికల్లో భాజపా తరపున ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనే విషయం పార్టీలోనే కాకుండా దేశ ప్రజల్లో సైతం చర్చ ఆరంభమైంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.