జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » గాంధీ జయంతి సందర్భంగా గ్రామీణ కోర్టులు (Rural courts | Law Ministry | Gandhi Jayanti)
 
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 5 వేల గ్రామీణ కోర్టులు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రక్రియను ఈ ఏడాది గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించనుంది. కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు కేంద్రం ఈ గ్రామీణ కోర్టులను ఏర్పాటు చేస్తోందని కేంద్ర న్యాయ శాఖ బుధవారం వెల్లడించింది.

గ్రామ న్యాయాలయాలు ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబరు 2 నుంచి అమల్లోకి వస్తుందని న్యాయ శాఖ కార్యదర్శి టీకే విశ్వనాథన్ వెల్లడించారు. న్యాయ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో పంచాయితీ స్థాయిల్లో 5000 గ్రామీణ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దీని వలన న్యాయ ప్రక్రియ వేగవంతం అవుతుందన్నారు.

నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సంబంధించిన ప్రక్రియను చేపడతాయని, దీనిని పూర్తి చేసేందుకు తరువాత ఇంకొంత సమయం పడుతుందని విశ్వనాథన్ పేర్కొన్నారు.

వ్యయం కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు మొదట గ్రామీణ కోర్టులు ఏర్పాటు చేసేందుకు నిరాకరించాయి. అయితే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గత నెలలో దేశ రాజధానిలో జరిగిన న్యాయమూర్తుల సమావేశంలో మాట్లాడుతూ.. గ్రామ న్యాయాలయ చట్టాన్ని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.