జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » భారత్‌లో ఆర్థిక సంక్షోభం లేదు: మన్మోహన్ (Economic crisis | India | Global stability | PM)
 
దేశంలో ఆర్థిక సంక్షోభం లేదని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తెలిపారు. భారత్‌లో ఆర్థిక సంక్షోభం జాడలేదని అమెరికా పర్యటనలో ఉన్న మన్మోహన్ సింగ్ శుక్రవారం పేర్కొన్నారు. అయితే అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రభావితమయ్యాయమని చెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం వలన భారత ఎగుమతులు దెబ్బతిన్నాయి.

ఈ పరిణామంతో వృద్ధి రేటు మందగించిందని మన్మోహన్ సింగ్ తెలిపారు. అయినప్పటికీ తమ ఆర్థిక వ్యవస్థ ఆరున్నర శాతం వృద్ధి రేటు సాధిస్తూ ముందుకెళుతోందని పేర్కొన్నారు. అందువలన భారత్‌లో ఆర్థిక మాంద్యం లేదని చెబుతున్నానన్నారు. ప్రపంచ దేశాలు ఒకదానిపైఒకటి బాగా ఆధారపడిన కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, వృద్ధి ప్రభావం భారత్‌పై ఉంటుందన్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే సహజంగా దాని ప్రభావం తమ దేశం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే తమ వృద్ధి రేటు, ముఖ్యంగా ఎగుమతులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రతికూల పరిస్థితుల కారణంగా దెబ్బతిన్నాయన్నారు. వజ్రాలు, ఆభరణలు, తోలు సంబంధ వస్త్రాల వంటి ముఖ్యమైన ఖరీదైన ఉత్పత్తుల ఎగుమతులు తీవ్రంగా ప్రభావితమయ్యాయని వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.