ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » మహతో అరెస్ట్: అక్టోబర్ 3న మావోల బంద్ (Mahato arrest | October 3 | Moaists strike | Lalgarh | Kishanjee | tribal people | PCAPA)
పోలీసు అత్యాచారాలకు వ్యతిరేకంగా పీపుల్స్ కమిటీ అగెనెస్ట్ పోలీస్ అట్రాసిటీస్- పీసీఏపీఏ (ప్రజా సంఘం) పేరుతో ఉద్యమం నడుపుతున్న గిరిజిన ప్రజలకు నేతృత్వం వహిస్తున్న ఛత్రధర్ మహతోను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో గత కొద్ది నెలలుగా పశ్చిమ బెంగాల్‌లోని లాల్‌గడ్‌లో రక్తపాతానికి పోలీసులు బ్రేక్ వేశారు.
మహతో అరెస్టుతో అక్టోబర్ 3వ తేదీన జాతీయ స్థాయి బంద్ నిర్వహించాలని మావోయిస్టులు తీర్మానించినట్లు తెలిసింది. అంతకుముందు.. లాల్‌గఢ్‌లో పోలీసులను బహిష్కరించే లక్ష్యంతో గతం ఏడాది నవంబరులో ఏర్పాటైన గిరిజన సంఘానికి మహతో నేతృత్వ వహిస్తున్నాడు.
మావోల సాయంతో లాల్‌గడ్ ప్రాంతాన్ని విముక్తం చేసి తొమ్మిది నెలల పాటు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. వాస్తవానికి గత ఏడాది అక్టోబర్ వరకు మహతో.. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే నవంబర్‌లో గిరిజన సంఘానికి నాయకత్వం వహించారు.
లాల్‌గడ్‌లో యథావిధి పరిస్థితి నెలకొనేందుకు కేంద్ర, ప్రభుత్వ రాష్ట్రాలు కొద్ది కాలం క్రిందట జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు. కేంద్ర బలగాల సాయుధ చర్య ప్రారంభమైన కొద్దికాలానికి మహతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో.. ఈ నేపథ్యంలో.. మహతో.. ఇంటర్వ్యూ కావాలంటూ.. పాత్రికేయుల రూపంలో ఓ ప్రత్యేక పోలీసు బృందం వెళ్లింది. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి, వలపన్ని మహతోను ఈ బృందం అరెస్టు చేసింది.
నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు మహతోను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆయనను ప్రస్తుతం మిడ్నాపూర్‌కు తరలించారు. అక్కడ పోలీసులు మహతోను ఇంటరాగేట్ చేయడం జరిగింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం.. రాజ్య వ్యతిరేక కార్యకలాపాలు సాగించారు అనే తదితర ఆరోపణలతో సుమారు 21 కేసులు మహతోపై నమోదయ్యాయి.
ఆదివారం రోజు మహతోను కోర్టులో హజరుపరచనున్నారు. ఈ అరెస్టుతో చెలరేగిన మావోయిస్టులు కంటాపహారీలో ల్యాండ్‌మైన్ పేల్చారు. దీని తర్వాత భారత మావోయిస్టు కమ్యూనిస్ట్ పార్టీ నేత కిషన్‌జీ మాట్లాడుతూ.. తమ సంస్థ.. అక్టోబర్ 3వ తేదీన జాతీయ స్థాయి బంద్‌కు పిలుపునిస్తన్నట్లు తెలిపారు.