అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్న తర్వాత భారతదేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారంనాడు స్వదేశానికి తిరిగి వచ్చారు.
శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా ప్రపంచంలోని అగ్రదేశాలతోపాటు ఇతర ప్రధాన దేశాలు మాంద్యంతో అతలాకుతలమౌతున్న దేశాలకు ప్రత్యేక ప్యాకేజీలు అవసరమని తీర్మానించాయని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు.
ఆర్థికంగా ఎదుగుతున్న దేశాల్లో భారతదేశం చేటు సంపాదించుకుందని శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొని భారత్ తిరిగి వచ్చిన ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు.
తన నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రెండు రోజుల పర్యటన నిమిత్తం పిట్స్‌బర్గ్ వెళ్ళిన ప్రధాని అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా నేతృత్వంలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.