జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » రాజస్థాన్‌లో రైలు ఢీకొనడంతో ముగ్గురి మృతి (Rajasthan | Alwar | Roopwas | Railway Station | Bomb | Liquor)
 
రాజస్థాన్‌లోని అల్వర్ పట్టణానికి సమీపంలో రూప్‌వాస్ రైల్వే స్టేషనుకు సమీపంలో ముగ్గురిని రైలు ఢీకొనింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.

అల్వర్ పట్టణానికి సమీపంలో రైల్వే ట్రాక్‌పై రైలు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారని స్థానిక పోలీసులు తెలిపారు. దుర్ఘటనా స్థలంలో మద్యం బాటిళ్ళు, ఐదు బాంబులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారి సరితా సింగ్ తెలిపారు.

ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన జరిగినట్లు ఆయన వెల్లడించారు. మృతులెవరనేది ఇంకా తెలియాల్సి ఉందని, తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

మృతుల వద్ద మద్యం బాటిళ్ళతో పాటు ఐదు బాంబులున్నాయని, వీరు ఎవరనేదానిపై ప్రస్తుతం విచారణ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. మృతుల వద్ద బాంబులతోపాటు మరికొన్ని సంచులుకూడా లభ్యమైనట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.