ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » రెండు దశాబ్దాల తర్వాత దసరా: కాశ్మీరీ పండిట్లు (Two Decades | Kashmeer | Pandits | Srinagar | Ratan Chaku | Dasara | Ravan | Kumbhakarna)
దేశానికి మకుటంగానున్న ప్రాంతం కాశ్మీర్. ఈ కాశ్మీర్ లోయలోనివారు దసరా మహోత్సవాలు దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత జరుపుకుంటున్నారు.
రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా దసరా ఉత్సవాలను కాశ్మీర్ లోయలో నివసిస్తున్న మైనారిటీ వర్గీయులైన కాశ్మీరీ పండిట్లు ఆనందోత్సాహాల నడుమ ఈ ఏడాది జరుపుకోనున్నారు.
కాశ్మీరీ పండిట్ సంఘర్షణ సమితి ఈ ఏడాది దసరా ఉత్సవాలను నిర్విహించనుందని సమితి ప్రధాన కార్యదర్శి రతన్ ఛాకూ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని శ్రీనగర్‌లోని టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్ ఆవరణలో 28 సెప్టెంబర్ సాయంత్రం ఐదున్నర గంటలకు జరుపనున్ట్లు ఆయన తెలిపారు.
దసరా ఉత్సవాల సందర్భంగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికులు రావణుడు, మేఘనాథుడు మరియు కుంభకర్ణుని ప్రతిమలను తయారు చేస్తున్నారు. వీరిలో అత్యధికులు ముస్లిం మతానికి చెందిన వారు కావడం గమనార్హం.
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రావణుని దహించే కార్యక్రమాన్ని ఇక్కడ ప్రవేశ పెట్టనున్నామని, దసరా మహోత్సవాలను ఉల్లాసంగా జరుపుకునేందుకు తాము అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. చివరి సారిగా ఈ దసరా ఉత్సవాలు 1990వ సంవత్సరంలో బఖ్షీ స్టేడియం వద్ద హజోరీ బాగ్‌లో జరిపినట్లు ఆయన తెలిపారు.
ఇదిలావుండగా గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడి ఆలయాలు స్థానికుల సహకారాలతో తెరిచి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. స్థానికుల సహాయ సహకారాలతోనే ప్రస్తుతం తాము ఈ దసరా మహోత్సవాలను నిర్వహించేందుకు పూనుకున్నామని నిర్వాహకులు తెలిపారు.