జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » బీజేపీ ర్యాలీలో కాల్పులు: ఒకరి మృతి (Solapur | District | Sheganv | BJP | Rally | Police | Party)
 
సోలాపుర్ జిల్లాలోని షేగాంవ్‌లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన ప్రజలపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా ముగ్గురు తీవ్ర గాయాలపాలైనారు.

సోలాపుర్ జిల్లాలోని షేగాంవ్‌లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన ప్రజలపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా ముగ్గురు తీవ్ర గాయాలపాలైనట్లు పోలీసులు చెప్పారు.

అక్కల్‌కోట్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సిద్ధరామప్ప పాటిల్ ర్యాలీ వద్దకు చేరుకోగానే ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయాలపాలైనవారిని సోలాపుర్ ఆసుపత్రిలో చేర్పించినట్లు పోలీసులు తెలిపారు.

కాల్పులు జరిపిన నిందితుడు సంఘటనా స్థలం నుంచి పారిపోయాడని, ఇప్పటి వరకు ఎవ్వరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. సంఘటన జరిగిన స్థలాన్ని సందర్శించామని, నిందుతులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు అన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.