జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » 26/11 విచారణను పర్యవేక్షించమన్న భారత్ (Pakistan | Mumbai attacks | Bilateral talks)
 
గత ఏడాది జరిగిన ముంబయి మారణహోమానికి సంబంధించి పాకిస్థాన్ యంత్రాంగం జరిపే విచారణలను తాము పర్యవేక్షించమని భారత్ ఆదివారం స్పష్టం చేసింది. పాకిస్థాన్ యంత్రాంగం అక్టోబరు 3 నుంచి ముంబయి దాడుల విచారణను ప్రారంభించనుంది. ముంబయి దాడులకు సంబంధించి తాము అరెస్టు చేసిన అనుమానితులను వచ్చే నెల 3 నుంచి విచారించనున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో.. భారత విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ న్యూయార్క్‌లో మాట్లాడుతూ.. ఈ విచారణ ప్రక్రియను భారత్ పర్యవేక్షించదని తెలిపారు. పాకిస్థాన్ వంటి మిత్రదేశంలో జరుగుతున్న ఈ అధికారిక ప్రక్రియను భారత్ పర్యవేక్షించలేదన్నారు. ఇరుదేశాల విదేశాంగ మంత్రులు ద్వైపాక్షిక అంశాలపై న్యూయార్క్‌లో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.

పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషితో చర్చల అనంతరం ఎస్ఎం కృష్ణ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ చట్టాల పరిధిలోనే ముంబయి దాడుల కుట్రదారులకు శిక్షలు పడాలని భారత్ కోరుకుంటుందన్నారు.

ఇదిలా ఉంటే తాజా సమావేశం అనంతరం ఖురేషి మాట్లాడుతూ.. ముంబయి దాడులకు సంబంధించి పాకిస్థాన్ ఏడుగురు అనుమానితులను అరెస్టు చేసిందని, వారి విచారణను అక్టోబరులో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ విచారణల పర్వంతో ముంబయి దాడుల దర్యాప్తుకు ముగింపు లభించిందని పాకిస్థాన్ భావించడం లేదన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.