జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » భారీ వర్షాలు: మూడు రాష్ట్రాల్లో 227 మంది మృతి (Floods | Karnataka | Andhra Pradesh | Maharshtra | People | Krishna | Army)
 
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా మూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో ఏర్పడిన వరద ముప్పు వల్ల ఇప్పటి వరకు 227 మంది మృత్యువాత పడినట్టు అధికార వర్గాల సమాచారం.

గత బుధవారం నుంచి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెల్సిందే. ఫలితంగా నదులు పొంగి పొర్లుతున్నాయి. వరద నీరు అనేక జనావాస ప్రాంతాలను జనసంద్రాలుగా మార్చేశాయి. ఈ వరద నీటిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

ఆదివారానికి ఈ మూడు రాష్ట్రాల్లో 227 మంది మృతి చెందినట్టు అధికారులు చెపుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో 156 మంది మృతి చెందగా, ఆంధ్రప్రదేశ్‌లో 50, మహారాష్ట్రలో 21 మంది మేరకు చనిపోయినట్టు ప్రాథమిక సమాచారం.

అలాగే, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరద ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే, గృహాలలో చేరిన వరద నీరు తగ్గేందుకు ఇంకా కొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో త్రివిధ దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను వేగవంతం చేశాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.