మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు సమీపంలోని బిషెన్‌పూర్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మిలిటెంట్లు హతమయ్యారు. తమ విధుల్లో భాగంగా గస్తీ నిర్వహిస్తున్న కమాండర్లపై మిలిటెంట్లు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన కమాండర్లు మిలిటెంట్ల కాల్పులను తిప్పికొట్టే పనిలో భాగంగా ఎదురు కాల్పులు నిర్వహించారు.
దీంతో ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మిలిటెంట్లు ప్రాణాలు కోల్పోయారు. వారి వద్ద నుంచి ఆధునాతన తుపాకీలతో పాటు మందుగుండు సామాగ్రిని సైతం కమాండర్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే, మిలిటెంట్ల కాల్పుల్లో ఒక కమాండర్ గాయపడగా, అతన్ని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.