జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » జాతీయ విపత్తుగా ప్రకటించాలి: యడ్యూరప్ప విజ్ఞప్తి (Flood | National disaster | Yeddyurappa | PM | Letter | Relief Fund)
 
కర్ణాటక రాష్ట్రంలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప విజ్ఞప్తి చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం తక్షణం వెయ్యి కోట్ల రూపాయలను విడుదల చేయాలని ఆయన కోరారు.

ఈ మేరకు ప్రధానికి ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఇందులో భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో కలిగిన నష్టాన్ని అందులో వివరించారు. ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని 14 జిల్లాల్లో అపార నష్టం ఏర్పడిందని, అందువల్ల రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలని కోరారు. ముఖ్యంగా పునరావాస చర్యల కోసం తొలివడత నిధులను తక్షణం విడుదల చేయాలని ఆయన కోరారు.

గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఉత్తర కర్ణాటక రాష్ట్రంలో తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా తలెత్తిన వరద వల్ల 125 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.