జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఎన్నికల్లో భాజపా కూటమి విజయం ఖాయం: రాజ్‌నాథ్ (Rajnath | confident | BJP-Shiv Sena | victory | Maharashtra | Poll Assembly)
 
ఈనెలలో జరుగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ - శివసేన కూటమి తప్పుకుండా విజయం సాధిస్తుందని భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.

దీనిపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల అనంతరం మహారాష్ట్రలో భాజపా-సేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ కూటమికి వ్యతిరేకంగా వాతావరణం ఉందని జోస్యం చెప్పారు.

మహారాష్ట్రకు చెందిన పార్టీ నేతల్లో అంతర్గత విభేదాలు ఉన్నట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. తమ కూటమికి అనుకూల పవనాలు రాష్ట్రంలో వీస్తున్నాయని చెప్పారు. మీడియా ప్రస్తావించిన అంశాలపై ఆయన ముక్తసరిగానే సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా, మహిళా ఫైర్‌బాండ్ ఉమా భారతిని తిరిగి పార్టీలో చేర్చుకునే అంశంపై రాజ్‌నాథ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయక పోవడం గమనార్హం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.