జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » నేడు హైదరాబాద్‌కు రానున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా (State | Sonia Gandhi | Floods Villages | Karnoll | MBNR | Regional)
 
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సోమవారం రాష్ట్ర రాజధానికి వస్తున్నారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో ఆమె ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. ఉదయం 10.15 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ తర్వాత వరద తాకిడికి గురైన మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల్లో ఆమె ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తారు.

ఆమె వెంట కేంద్ర హోం శాఖామంత్రి పి.చిదంబరం కూడా వస్తున్నారు. ఆయన కూడా సోనియా హెలికాఫ్టర్‌లోనే ప్రయాణించి వరద బీభత్సాన్ని అంచనావేస్తారు. సోనియాతో పాటు.. ముఖ్యమంత్రి రోశయ్య, పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీలు కూడా ఉంటారు.

ఈ రెండు జిల్లాల్లో ఏరియల్ సర్వే ముగిసిన తర్వాత ఆమె నేరుగా ఉత్తర కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటిస్తారు. మళ్లీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునే సోనియా గాంధీ హైదరాబాద్‌లో ప్రభుత్వం చేపట్టిన వరద సహాయక చర్యలపై ముఖ్యమంత్రి రోశయ్యను అడిగి తెలుసుకుని, ఢిల్లీకి పయనమవుతారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.