ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » కేరళలో పడవ ప్రమాదం: ఇద్దరు సిబ్బంది అరెస్టు (Boat capsize | steerman | crew member | arrested | Kerala | Police | Thekkady)
కేరళ రాష్ట్రంలోని థేక్కడి నదిలో జరిగిన ఘోర పడవ ప్రమాదానికి సంబంధించి పడవ స్టీర్‌మెన్, ఒక క్రూ సభ్యుడిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని సోమవారం ఇడుక్కి జిల్లా పోలీసులు వెల్లడించారు. గత నెల 30వ తేదీన కేరళ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన జలకన్యక అనే డబుల్ డెక్కర్ పడవ పెరియార్ వన్యప్రాణుల సంరక్షణా కేంద్రంలోని ఇడుక్కి నదిలో మునిగి పోయిన విషయం తెల్సిందే.
ఈ ప్రమాదంలో 45 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. దీనిపై ప్రాథమిక విచారణ చేపట్టిన స్థానిక పోలీసులు.. పడవలో సామర్థ్యానికి మంచి పర్యాటకులను ఎక్కించడం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్టు తేలింది. ముఖ్యంగా, పడవ మొదటి అంతస్తులోకి ఎక్కువ మందిని స్టీర్‌మెన్, క్రూ మెంబర్స్ ఎక్కించారని, ఫలితంగా పడవ బోల్తా పడి మునిగి పోయినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
దీనికి సంబంధించి స్టీర్‌మెన్ విక్టర్ శామ్యూల్, క్రూ మెంబర్ల్ అనిష్‌లను అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. వీరిని ఇడుక్కి జిల్లాలోని పీరుమడే మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరుచనున్నట్టు పోలీసులు తెలిపారు.