జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » భాజపా నేత ఖండేల్‌వాల్ గుండెపోటుతో మృతి (Pyarelal Khandelwal | BJP | Passes | Advani | Manmohan | Cardiac arrest)
 
ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ప్యారేలాల్ ఖండేల్‌వాల్ కన్నుమూశారు. ఆయన మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఖండేల్‌వాల్ మృతి వార్త తెలుసుకున్న ప్రధాని మన్మోహన్ సింగ్, భాజపా అగ్రనేతలు ఎల్కేఅద్వానీ, రాజ్‌నాథ్ సింగ్‌లు ప్యారేలాల్ ఇంటికి వెళ్లి అంజలి ఘటించారు.

అంతకుముందు ఖండేల్‌వాల్ వివిధ రకాల వ్యాధులతో అనారోగ్యం బారిన పడ్డారు. అయితే, అకస్మాతుగా గుండెపోటు రావడంతో ఆయనను ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించగా, అక్కడ మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు.

ఇదిలావుండగా, మధ్యప్రదేశ్‌కు చెందిన ఆయన ఆర్సెస్ కార్యకర్తగా పని చేస్తూ.. భాజపా సభ్యత్వం పుచ్చుకున్నారు. గతంలో భాజపా ఉపాధ్యక్షుడిగా, ఎన్నికల సంఘం సభ్యుడిగా కూడా పని చేశారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను రాజ్‌ఘర్ స్థానంలో ఓడించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉండటంతో భాజపా అధినాయకత్వం రాజ్యసభకు పంపింది. ఖండేల్‌వాల్ అంత్యక్రియలు భోపాల్‌లో జరుగనున్నాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.