జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » రెండు రాష్ట్రాల్లో వరదలు: 269కు పెరిగిన మృతులు (Major breach | Krishna | canal | toll | AP | Karnataka | River | Flood)
 
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంభవించిన భారీ వరదలకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 269కు చేరుకుంది. కృష్ణా నది కరకట్టకు భారీ గండిపడింది. దీంతో గుంటూరు జిల్లాలోని అనేక గ్రామాలు నీట మునిగే ప్రమాదం ఉంది. అలాగే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని అధికార యంత్రాంగం చెపుతోంది.

కృష్ణ నది కుడి గట్టుకు భారీ గట్టు పడటంతో గుంటూరు జిల్లాలోని రెపల్లెతో పాటు.. సుమారు 20 గ్రామాలు నీట మునిగే అవకాశం ఉందని ఆయని నీటి పారుదల శాఖ అధికారులు బుధవారం తెలిపారు. ప్రస్తుతం సమస్య తీరిపోయిందని మేం చెప్పలేం. వరద నీరు ఇంకా వస్తూనే వుంది.

అందువల్లే మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని భావించామని విజయవాడలోని ఫ్లడ్ రిలీఫ్ వర్క్స్ స్పెషల్ ఆఫీసర్ రాజీవ్ శర్మ తెలిపారు. ఇదిలావుండగా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వరద మృతుల సంఖ్య 63కు చేరుకుంది. ప్రకాశం బ్యారేజీ నుంచి మంగళవారం 7.8 లక్షల క్యూసెక్కుల నీరు ఔట్‌ఫ్లో వెళ్లడంతో పరిస్థితి కాస్త మెరుగుపడిందన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.