జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » బీహార్‌, జార్ఖండ్‌‌లలో బంద్‌: మావోయిస్టులు పిలుపు (Bihar | Jarkhand | Maoists |Paramilitary | Orissa | Gopal | Spokes Person)
Feedback Print Bookmark and Share
 
బీహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు బంద్‌ పాటించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.

బీహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు బంద్‌ నిర్వహించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. కేంద్రప్రభుత్వం పారా మిలిటరీ బలగాలతో తమకు వ్యతిరేకంగా కేంద్రం చర్యలకు దిగడాన్ని వ్యతిరేకిస్తూ 12నుంచి బంద్‌ నిర్వహించాలని తాము నిర్ణయించినట్లు బీహార్‌, జార్ఖండ్‌, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ప్రత్యేక కమిటీ అధికార ప్రతినిధి గోపాల్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇదిలావుండగా తాము ఈ వారం 7నుంచి 13 వరకు ‘ఆందోళన వారం’గా పాటించనున్నట్టు కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా మరోవైపు మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్‌ మరాండీ నేతృత్వంలోని జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా ఈ నెల 10న ఇప్పటికే బంద్‌కు పిలుపునిచ్చింది. అదే రోజు జార్ఖండ్ ముక్తి మోర్చా రాజధాని రాంచీలో పెద్ద ర్యాలీకి సన్నాహాలు చేస్తోంది.

ఇక బీజేపీ 11వ తేదీన రాజ్‌భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో రాష్ట్రంలో కల్లోల వాతావరణం సృష్టించేందుకు పలు ప్రతిపక్ష పార్టీలు, మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారని అధికార పార్టీకి చెందిన కొందరు అభిప్రాయపడ్డారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.