జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » నేటితో మూడు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం సమాప్తం! (Three States | Assembly Election | Campaign | Loksabha | Maharastra)
Feedback Print Bookmark and Share
 
ఈనెల 13వ తేదీన జరుగనున్న మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రం ఐదు గంటలతో తెరపడనుంది. దీంతో అన్ని రాజకీయ పార్టీల నేతలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తరువాత అదే స్థాయిలో జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలూ తమ బలాలు నిరూపించుకునేందుకు విస్తృతంగానే ప్రచారం సాగిస్తున్నాయి.

గత నెల రోజులుగా కాంగ్రెస్‌, భాజపా పార్టీలకు చెందిన అగ్రనేతలంతా ఈ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైవున్నారు. మహారాష్ట్రలో నక్సలైట్లు ఒక్కసారిగా విరుచుకుపడిన ఘటనలో 20 మంది పోలీసులు మరణించారు. అయితే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూస్తామని ఎన్నికల సంఘం అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌, భాజపా అగ్రనేతలు ఎల్‌కె.అద్వానీ, రాజ్‌నాథ్‌ సింగ్‌, సుష్మాస్వరాజ్‌, అరుణ్‌ జైట్లీ, వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొని తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.