జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » మహా ఎన్నికల సమరం: శివసేన అభ్యర్థి కాల్చివేత (Shiv Sena | Ajay Bhosle | Maharashtra assembly polls | Congress | Pune)
Feedback Print Bookmark and Share
 
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న శివసేన అభ్యర్థి అజయ్ భోంస్లేను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి వేశారు. ఆదివారం ఉదయం ఆ సంఘటన పూణెలో చోటు చేసుకుంది.

వాడ్గాన్ ప్రాంతంలోని కోరెగాన్ పార్క్ సమీపంలో అజయ్ భోంస్లే కారులో వస్తుండగా దుండగులు దారుణంగా కాల్చివేశారు. మోటార్ బైక్‌పై వచ్చిన దుండగులు భోంస్లేపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఆయన అక్కడే కుప్పకూలి పోయారు. ఈ సంఘటనలో భోంస్లే కారు డ్రైవర్ కూడా గాయపడినట్టు సమాచారం. దీనిపై పూర్తి వవరాలు అందాల్సి వుంది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌‌కు 48 గంటల సమయం ఉండగా ఇది చోటు చేసుకుంది. కాగా, ఎన్నికలు జరిగే మహారాష్ట్ర, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచరాం ఆదివారం సాయంత్రంతో ముగియనుంది.

మొత్తం 288 అసెంబ్లీ సీట్లు కలిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 75634525 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 82028 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 13వ తేదీన పోలింగ్ జరుగుతుండగా, 22వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.