ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » నక్సల్స్ హింసాత్మక చర్యలు: 2600 మంది మృత్యువాత (Naxal Violence | Civilian Deaths | Moists | State | Development | Bihar)
గత మూడు సంవత్సరాల కాలంలో నక్సల్ జరిపిన హింసాత్మక చర్యల్లో దాదాపు 2600 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో సాధారణ పౌరులు సైతం ఉన్నారు. నక్సల్స్ ప్రాబల్య రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ఈ నష్టం వాటిల్లింది. గత 2006 సంవత్సరం జనవరి నుంచి ఈ యేడాది ఆగస్టు వరకు 2212 మంది మరణించినట్టు కేంద్ర హోం శాఖ వర్గాలు వెల్లడించాయి.
ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా 5800 సంఘటనలు చోటు చేసుకున్నాయి. అంతర్గత భద్రతకు ప్రమాదకరంగా మారిన నక్సల్స్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు సరికొత్త పంథాను అనుసరించనున్నట్టు హోంశాఖ వర్గాలు వెల్లడించాయి.
కాగా, మొత్తం సంఘటనల్లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 715 సంఘటనల్లో 388 మందిని మావోయిస్టులు 2006లో హత్య చేశారు. వీరిలో 2007 మందిలో 369 మంది ప్రాణాలు కోల్పోగా, 2008లో 242 మంది, ఈ ఏడాది ఇప్పటి వరకు 180 మంది ఉన్నారు.
అలాగే, జార్ఖండ్ రాష్ట్రంలో 2006లో 124 మంది, 2007లో 157 మంది, 2008లో 207 మంది, 2009 ఆగస్టు వరకు 150 మంది మృత్యువాత పడ్డారు. వామపక్ష తీవ్రవాదాన్ని తుదముట్టించేందుకు 40 వేల మంది పారామిలిటరీ బలగాలను ఉపయోగించింది. అలాగే, ఈ ప్రాంతాల్లో 7300 కోట్ల రూపాయలతో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని ప్రకటించింది.
దీనిపై కేంద్ర హోమంత్రి చిదంబరం స్పందిస్తూ.. దేశంలో 20 రాష్ట్రాల్లో నక్సలైట్ తమ ప్రభావాన్ని చూపుతున్నారన్నారు. అలాగే నక్సలైట్ల దుశ్చర్యల వల్ల 223 జిల్లాల్లో రెండు వేల పోలీసు స్టేషన్లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దెబ్బతిన్నట్టు ఆయన తెలిపారు.