జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » మా పార్టీ తెరవెనుక శక్తులు మావోయిస్టులు: మమత (Trunumool Congress | Mamata Benarji | Moists | Party | PM | Internal Security)
Feedback Print Bookmark and Share
 
మావోయిస్టుల మేధోసంపత్తిని తమ పార్టీ ఉపయోగించుకుంటోందని, ఒక విధంగా చెప్పాలంటే మా పార్టీని నడిపించే తెరవెనుక శక్తులు మావోలేనని కేంద్ర రైల్వే శాఖామంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఫలితంగా తృణమూల్‌ పార్టీతో మావోలకు ఉన్న సంబంధాలను ఆమె బాహాటంగానే ప్రకటించారు.

ఈ అంశంపై ఆమె ఆదివారం ఒక టీవీ ఛానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మావోయిస్టుల సమస్యను సున్నిత సమస్యగా కేంద్రం పరిగణించాలని సూచించారు. దేశంలో పారిశ్రామికీకరణకు వ్యతిరేకంగా జరిగే ప్రజా ఉద్యమాలలో మావోల పాత్ర కీలకంగా ఉందని చెప్పారు.

మావోయిస్టుల వల్ల దేశ అంతర్గత భద్రతకు తీవ్ర ముప్పు ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారం కూడా ముంబైలో చెప్పిన నేపథ్యంలో మమతా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇకపోతే.. మావోయిస్టు సీనియర్ నేత ఛత్రధర్‌ మహతో అరెస్టును ఆమె ఖండించారు.

కేంద్ర ప్రభుత్వం మహతోను అరెస్టు చేయాలనుకోలేదని, ఛత్రధర్‌పై యూఏపీఏ చట్టం ప్రకారం అభియోగాలు మోపారని, అందువల్ల ఆయనను కేంద్రానికి అప్పగించాలే గానీ రాష్ట్ర పోలీసులు విచారించరాదన్నారు. ఇకపోతే.. ఆయుధాలు వీడితేనే మావోలతో చర్చలకు సిద్ధమని కేంద్రం ప్రకటించడాన్ని మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.