జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » 2012 నాటికి పూర్తికానున్న అతిపెద్ద రైలు వంతెన: అహ్మద్ (Work | India | rail bridge | Ahmed | ECR | Ganga River | Bihar | Nitish Kumar)
Feedback Print Bookmark and Share
 
దేశంలోనే అతిపెద్ద రైలు వంతెన నిర్మాణం వచ్చే 2012 డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తవుతుందని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి ఇ.అహ్మద్ తెలిపారు. 4556 మీటర్ల పొడువు గల రోడ్డు మరియు రైలు వంతెన నిర్మాణం గంగానదిపై సాగుతోంది.

తూర్పు మధ్య రైల్వే అధికారులతో కలిసి మంత్రి అహ్మద్ రైలు వంతెన నిర్మాణ పనులను పర్యవేక్షించారు. కాగా, ఆ ప్రాజెక్టును 1366 కోట్ల రూపాయల వ్యయంతో సాగిస్తున్నట్టు ఆయన తెలిపారు. మంత్రి వెంట ఈసీఆర్ జనరల్ మేనేజర్ దీపక్ కృష్ణ, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మధురేష్ కుమార్, డివిజిన్ రైల్వే మేనేజర్ జ్ఞాన్ ప్రకాష్ తదితరులు ఉన్నారు.

వంతెన నిర్మాణ పనులు సాగుతున్న తీరుపై మంత్రి అహ్మద్ సంతృప్తి వ్యక్తం చేశారని ఈసీఆర్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, బీహార్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో అంటే నాలుగేళ్ళ క్రితం ఈ బ్రిడ్జీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.