జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » శంకర రామన్ హత్యకేసు నవంబరు 27కు వాయిదా (Kanchi | Sankararaman | murder case | adjourned | Jayendra Saraswati | Seer)
Feedback Print Bookmark and Share
 
కంచి వరదరాజపెరుమాళ్ ఆలయ మేనేజర్ శంకర రామన్ హత్య కేసు విచారణ మరోమారు వాయిదా పడింది. ఈ కేసును విచారణ జరుపుతున్న పుదుచ్చేరి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయవాదులు కోర్టు విధులను బాయ్‌కట్ చేయడంతో కేసును నవంబరు 27వ తేదీకి మేజిస్ట్రేట్ వాయిదా వేశారు.

తమ డిమాండ్ల పరిష్కారంలో పుదుచ్చేరి బార్ అసోసియేషన్ చేసిన ఒక తీర్మానానికి నిరసనగా అడ్వకేట్లు కోర్టు విధులను బహిష్కరించారు. దీంతో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి డి.కృష్ణరాజా కేసు విచారణను వచ్చే నెల 25వ తేదీకి వాయిదా వేశారు. కాగా, ఈ కేసు విచారణకు 24 మంది నిందితులల్లో 12 మంది మాత్రమే హాజరయ్యారు.

ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న కంచి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతిలు కూడా ఉన్నారు. వీరిపై సెక్షన్లు 120 (బి), 302ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెల్సిందే.

వరదరాజ పెరుమాళ్ ఆలయ మేనేజర్‌గా ఉన్న శంకర రామన్‌ను గత 2004 సెప్టెంబరు మూడో తేదీన ఆలయ ప్రాంగణంలోనే దారుణంగా హత్య చేసిన విషయం తెల్సిందే. ఈ కేసు విచారణ సుప్రీంకోర్టు ఆదేశం మేరకు పుదుచ్చేరిలో జరుగుతోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.