ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » విధులకు జస్టీస్ దినకరన్ దూరంగా ఉండాలి: సొరాబ్జీ (Income | Wealth | Karnataka | High Court | PD Dinakaran | Sorabji | TN)
ఆదాయానికి మంచి ఆస్తుల సంపాదించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.డి.దినకరన్ విధులకు దూరంగా ఉండాలని మాజీ అటార్నీ జనరల్ సోలీ జె.సొరాబ్జీ అభిప్రాయపడ్డారు. తనపై వచ్చిన ఆస్తుల సంపాదన కేసు విచారణ ముగిసి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక నిర్ణయం తీసుకునేంత వరకు దినకరన్ విధులకు స్వచ్ఛందంగా దూరంగా ఉండాలని ఆయన కోరారు.
తమిళనాడుకు చెందిన దినకరన్ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా కూడా పని చేశారు. దీంతో దినకరన్ ఆస్తుల వివరాలు వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా, ఈ మేరకు నివేదిక సమర్పించింది. నివేదికలోని కొన్ని ఫిర్యాదులపై ప్రధాన న్యాయమూర్తి విచారణకు ఆదేశించారు. విచారణ నివేదిక వచ్చేంత వరకు దినకరన్ విధులకు దూరంగా ఉండాలని సొరాబ్జీ మీడియాకు చెప్పారు.