జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఛత్తీస్‌గఢ్‌లో 9 మంది మావోయిస్టుల అరెస్టు (Nine | Maoists | arrested | Chhattisgarh | Bastar Region | Raipur | Naxals)
Feedback Print Bookmark and Share
 
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో తొమ్మిది మంది మావోయిస్టు గెరిల్లాలను పోలీసులు అరెస్టు చేశారు. బస్తర్ రీజియన్‌లో వీరిని అరెస్టు చేసినట్టు శుక్రవారం పోలీసులు వెల్లడించారు. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న బస్తర్ రీజియన్‌లోని ఛమై గ్రామం, బాబ్రీ కోకోభాటా అనే ప్రాంతంలో గురువారం రాత్రి అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

దీనిపై బస్తర్ జిల్లా ఎస్పీ పి.సుందర్‌రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. నిషేధిత సీపీఎం (మావోయిస్టు) పార్టీలో వీరు కీలక సభ్యులుగా ఉన్నారని చెప్పారు. వీరి నుంచి నాలుగు పిస్తోళ్ళతో పాటు.. విప్లవ సాహిత్యాన్ని కైవసం చేసుకున్నట్టు తెలిపారు.

ఈ ప్రాంతంలో జరిగిన పలు దోపిడీ, హత్య కేసుల్లో వీరి పాత్రపై విచారణ జరుపుతున్నట్టు ఆయన తెలిపారు. 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణ కలిగిన బస్తర్ అడవుల్లో కనీసం పది వేల మంది మావోయిస్టు గెరిల్లాలు ఉన్నారు. వీరంతా రాకెట్ లాంఛర్లు, మోర్టార్స్, చిన్నతరహా ఫైర్ ఆయుధాలు కలిగి ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.