ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » బీహార్లో నాయకుల పేర్లతో టపాసులు (Bihar | Crackers | Market | Hot Cakes | Political Leaders | Lalu | Rabri | Nithish Kumar)
దేశవ్యాప్తంగా ప్రజలు దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పిల్లలు, పెద్దలు తమ తమ ఇళ్ళల్లో హడావుడి సందడి నెలకొంది. కాని బీహార్ టపాకాయల మార్కెట్లో రాజకీయ నాయకుల పేర్లతో కూడుకున్న టపాసులు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చేస్తుంటారు. అలాంటి రాజకీయ నాయకుల పేరుతో కొత్త బాంబులు బీహర్ మార్కెట్ ఇప్పుడు దీపావళి సందర్భంగా లభిస్తున్నాయి.
ఆ రాష్ట్ర ముఖ్యమంత్త్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిల పేర్లతో ఉన్న టపాసుల్ని ప్రజలు ఎగబడి కొంటున్నారు. ఇప్పుడు బీహార్ వీధుల్లో లల్లూ బాంబులు ఢాం అని పేలుతున్నాయి.
రబ్రీదేవి తారాజువ్వలు ఆకాశంలోకి దూసుకపోతుండటంతో అక్కడి ప్రజలు ఆనందంగా దీపావళి పండుగను జరుపుకుంటున్నారు.