జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » ఘనంగా దీపావళి జరుపుకున్న ప్రజలు (People exchanged sweets | decorated their homes | fireworks)
Feedback Print Bookmark and Share
 
దీపావళి పండుగ సందర్భంగా భారతదేశంతోపాటు ప్రపంచంలోని చాలా దేశాలలోని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ మిత్రులకు, బంధువులకు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుని స్వీట్లు పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఇండో-పాక్ సరిహద్దుల్లో ఇరు దేశాలకు చెందిన సైనికులు శుభాకాంక్షలు తెలుపుకని దీపావళి పటాకులు పేల్చి స్పీట్లు పంచి పెట్టారు.

ప్రధానంగా ఈ పండుగలో పిల్లలు కేరింతలు కొడుతూ... టపాసులు పేల్చడం పెద్దలను ఆనందానికి గురి చేసింది. యువత పెద్ద పెద్ద బాంబులు పేల్చి వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇదిలావుండగా దీపావళి పండుగ సందర్భంగా పలు దేవాలయాలలో పండితులు, పూజారులు, వేద మంత్రోచ్ఛారణల నడుమ ఘనంగా పూజలు నిర్వహించగా అందులో ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని తమ ఇష్టదైవాన్ని స్మరించుకున్నారు. దీంతోపాటు ప్రజలు తమ తమ ఇండ్లలో ప్రత్యేకంగా దీపాలను అలంకరించి చీకటి అనే అన్యాయాన్ని పారద్రోలేందుకు కృషి చేశారు.

కాగా దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేకమైన భద్రతా చర్యలు చేపట్టారు. అలాగే కొన్ని దేవాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి, తనిఖీలు నిర్వహించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.