జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » యూఐడీ కార్డు బహుళప్రయోజనకారి: నీలేకని (Central Govt | UID Number | Chairman | Nandan Neelekani | Driving Licence)
Feedback Print Bookmark and Share
 
కేంద్రప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టినున్న పదహారు అంకెల ప్రత్యేక సంఖ్యతో కూడుకున్న కార్డు(యూఐడీ) బహుళప్రయోజనకరంగా ఉంటుందని యూఐడీఏఐ చైర్మెన్ అన్నారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న యూఐడీ కార్డు ద్వారా బ్యాంక్ ఖాతాను ప్రారంభించడానికి, పాస్‌పోర్ట్ తీసుకునేందుకు, డ్రైవింగ్ లైసెన్సు తీసుకునేందుకు తదితర కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని యూఐడీఏఐ చైర్మెన్ నందన్ నీలేకని తెలిపారు.

తాము రూపొందించిన ఈ కార్డు వచ్చే 18 నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో బ్యాంక్ ఖాతాను ప్రారంభించడానికి, పాస్‌పోర్ట్ తీసుకునేందుకు, డ్రైవింగ్ లైసెన్సు పొందేందుకు యూఐడీ సంఖ్యను అడిగే విధానం వస్తుందని, ఇది ఓ గుర్తింపు కలిగిన సంఖ్యగా ఉంటుందని ఆయన వెల్లడించారు. వీటితోపాటు ఓటర్ ఐడి కార్డుగా కూడా ఉపయోగపడుతుంది.

రానున్న రోజుల్లో ఇది బహుళప్రయోజనకారిగా మారుతుందని, దీంతో తప్పుడు సమాచారం ఇచ్చేందుకు ఉండదని, ఇది గుర్తింపు పత్రానికి సమానంగా ఉంటుందని, ప్రతి చోట దీనిని ఉపయోగించుకోవచ్చని ఆయన వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.