జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోమారు రెచ్చిపోయారు. ఒక నక్సల్స్ నేతతో సహా ముగ్గురిని కాల్చి చంపారు. ఈ సంఘటన మంగళవారం రాజ్‌పూర్ సమీపంలో జరిగింది. కాగా, కాగా, మృతి చెందిన వారిని ఉమేష్ మలి, ఉమేష్ సింగ్ భోక్తా, రంజిత్ రజ్జక్‌లు ఉన్నారు.
సోమవారం రాత్రి జరుగుతున్న ఒక సాంస్కృతి కార్యక్రమాన్ని తిలకిస్తుండగా ఆయుధాలు ధరించిన మావోయిస్టులు వీరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు జిల్లా ఎస్పీ డియో బిహారీ శర్మ తెలిపారు. మరికొందరు గాయపడ్డారు.
వీరిలో పోలీసు వ్యాను డ్రైవర్ కూడా ఉన్నారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సస్త్రా పీపుల్స్ మోస్త్రా (ఎస్పీఎం)కు మావోయిస్టులకు మధ్య తీవ్రస్థాయిలో స్థానికంగా పోరు సాగుతోంది. మృతుల్లో ఉమేష్ మలి ఎస్పీఎంకు కీలక నేత కావడం గమనార్హం.