ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » సైక్లింగ్ చేయడమే రాహుల్ శరీర విజయ రహస్యం! (Cycling | Rahul Gandhi | Security | Yoga | Meditation | VVIP | National | Delhi)
కాంగ్రెస్ యువరాజు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, అమేథీ లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ స్లిమ్‌గా ఉండటానికి అనేకమంది పలు రకాల కారణాలు చెప్పారు. కొంతమంది యోగా చేస్తారని, మరికొందరు వ్యాయామాలు చేస్తారని ఇలా తమకు తోచినట్టుగా చెప్పుకుంటూ వచ్చారు.
అయితే, 38 సంవత్సరాల వయస్సులోనూ ఇంత స్లిమ్‌గా ఉండటానికి ఇవేమీ కాదని వెల్లడైంది. ప్రతి రోజూ క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడమే రాహుల్ విజయరహస్యమని తేలిపోయింది. వీవీఐపీ హోదా కలిగిన రాహుల్‌కు సైక్లింగ్ చేయడం సాధ్యమయ్యే పనేనా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది నిజం. అంత్యంత భారీ భద్రత కలిగిన రాహుల్ వారి రక్షణలోనే ఈ సైక్లింగ్ చేస్తూ ఒక కెమెరాకు చిక్కిపోయాడు.
రాహుల్ సైక్లింగ్ చేసే సమయంలో ముందు వెనుక అంగరక్షలు కూడా సైక్లింగ్ చేస్తుంటారు. మరోవైపు ఆయన ఎస్కార్ట్ వాహనాలు బందోబస్తుగా ఉంటూ ముందుకు సాగుతాయి. ఇలా అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ దేశ రాజధాని రహదారులపై రాహుల్ సైక్లింగ్ చేయడమే ఆయన శరీర రహస్యమని తేలిపోయింది.