జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » దాడులు జరిగే అవకాశం ఉంది... జాగ్రత్త: ప్రధాని (Terror, Attacks, Pakistan, Manmohan Singh, AK Antony, Home Minister P Chidambaram, External Affairs Minister SM Krishna)
Feedback Print Bookmark and Share
 
పొరుగు దేశం పాకిస్తాన్‌లో వరుస తీవ్రవాద దాడుల నేపధ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేకంగా త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉగ్రవాదులు దేశంలో మరోసారి తమ పంజాను విసిరే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయని వెల్లడించారు. ఉగ్రవాదుల నుంచి ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు భద్రతా దళాలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

భద్రాతా దళాలకు చెందిన ఉన్నతాధికారులతో మాట్లాడుతూ ప్రధాని... పొరుగుదేశంలో పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. ముంబయిలో ఉగ్రవాద దాడులు, ఇటీవల కాబూల్‌లోని భారత దౌత్య కార్యాలయంపై తీవ్రవాదుల పంజా వంటివి ప్రస్తావిస్తూ, ఉగ్రవాదులు మరోసారి దాడి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉందన్నారు.

ముంబయి దాడుల అనంతరం అంతటి తీవ్ర స్థాయిలో ఉగ్రవాదుల నుంచి ఎటువంటి ముప్పు తలెత్తనప్పటికీ, పొరుగు దేశంలో పరిణామాల దృష్ట్యా మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పరోక్షంగా అందుతున్న సంకేతాల నేపధ్యంలో సరిహద్దు ప్రాంతాలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రధాని సూచించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఈ సమావేశంలో త్రివిధ దళాలలకు చెందిన ఉన్నతాధికారులు, రక్షణ మంత్రి ఏకె ఆంటోనీ, హోం మంత్రి పి. చిదంబరం, విదేశాంగ వ్యవహారాల శాఖామంత్రి ఎస్ఎమ్ కృష్ణ పాల్గొన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.