జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » నక్సలైట్లను.. ఉగ్రవాదులను ఒకే గాటను కట్టలేం: చిదంబరం (Chidambaram| Naxals| Terrorism| Jammu and Kashmir| Maoists)
Feedback Print Bookmark and Share
 
Chidambaram
FILE
నక్సలైట్లను మావోయిస్టులతో పోల్చి చూడటం జరగదని, అలాగే జమ్మూ- కాశ్మీరులో దాడులకు పాల్పడే ఉగ్రవాదులతో సైతం పోల్చబోమని కేంద్ర హోం శాఖామంత్రి పి. చిదంబరం వెల్లడించారు. నక్సలైట్లు హింసాత్మక మార్గాన్ని విడనాడి భేషరతుగా ప్రభుత్వంతో చర్చలు జరపేందుకు ముందుకు రావాలనీ, జనస్రవంతిలో కలిసి జీవనం సాగించాలని ఆకాంక్షించారు.

సైనిక కమాండర్ల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి నక్సలైట్లు, మావోయిస్టులు, ఉగ్రవాదులందరినీ ఒకే గాటన కట్టే అవకాశం లేదని వెల్లడించారు. నక్సలైట్ సంస్థలు అభం శుభం తెలియని పిల్లలను ఆయుధాలుగా చేసుకుని భద్రతా దళాలపై దాడులకు తెగబడటాన్ని హేయమైన చర్యగా అభివర్ణించినప్పటికీ వారిని జనజీవన స్రవంతిలోకి తెచ్చేందుకుగాను ప్రభుత్వం అన్ని మార్గాలను తెరిచే ఉంచిందని చిదంబరం పేర్కొన్నారు.

దేశంలోని ఈశాన్య భారతంలోని తీవ్రవాదులు, జమ్ము- కాశ్మీరు ప్రాంతంలో దాడులకు తెగబడే ఉగ్రవాదులు తమకు స్వతంత్ర రాజ్యం కావాలని పోరాటం చేస్తున్నారనీ, కానీ నక్సలైట్లు పరిస్థితి వేరని సమావేశంలో పాల్గొన్న ఓ భద్రతాధికారి వెల్లడించారు.

ఇదిలావుండగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కొన్ని గ్రామాల్లో గ్రామానికి ఐదుగురు పిల్లల చొప్పున తమకు అప్పగించాలని నక్సలైట్లు ఆయా గ్రామస్తులను బెదిరించి లొంగదీసుకుంటున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఇటువంటి చర్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందనీ, దీనిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి సమస్య పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోందని తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.