జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » పర్యావరణ మార్పులపై యుద్ధం చేద్దాం: భారత్-చైనా (India | China | Climate | New Delhi | International climate deal)
Feedback Print Bookmark and Share
 
ప్రస్తుతం చైనా సరిహద్దు వెంబడి రగులుతున్న సమస్య అందరికీ తెలిసిందే. అయితే ఆ సమస్యలను ప్రస్తుతానికి ప్రక్కనపెట్టి భారత్-చైనాలు పర్యావరణ మార్పులపై యుద్ధం చేయాలని నిర్ణయించాయి. ఇందుకు అనుగుణంగా ఇరు దేశాలు బుధవారం సంయుక్తంగా ఓ అంగీకారికి వచ్చాయి. స్థానికంగా ఇరు దేశాల మధ్య చెప్పుకోదగ్గ సమస్యలేమీ లేవనీ రెండు దేశాల ప్రతినిధులు ఈ సందర్భంగా వెల్లడించారు.

పర్యావరణంపై ఇండో-చైనా సహకారించుకుంటాయని అంగీకార పత్రంపై సంతకాలు చేశాయి. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం పర్యావరణ శాఖామంత్రి జైరామ్ రమేష్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. భారత్-చైనా దేశాలు కలిసికట్టుగా పర్యావరణంలో అత్యంత వేగవంతంగా వస్తున్న మార్పులను గమనిస్తూ తగిన చర్యలు తీసుకునేందుకు కృతనిశ్చయంతో ఉన్నాయన్నారు. మంత్రి రమేష్ మాటలను చైనా పర్యావరణ శాఖామంత్రి క్జీ జెంఘువ సమర్థించారు.

అంగీరపత్రంలో భారత్-చైనాలు ఉదహరించిన వివరాల ప్రకారం... ప్రపంచంలో అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు ఇరు దేశాలు కృషి చేస్తాయి. అదేవిధంగా పర్యావరణ కాలుష్య రహిత శక్తి ఉత్పాదనకు గల అవకాశాలతో పాటు వ్యవసాయానికి రసాయన ఎరువులకు బదులు సేంద్రీయ ఎరువుల వాడకం ఇత్యాది అంశాలపైనా ఇరు దేశాలు దృష్టి సారిస్తాయి.

భారత- చైనా దేశాలకు సంబంధించిన పర్యావరణ శాస్త్రవేత్తలు ఇక నుంచి సంయుక్తంగా కలిసి పరిశోధనలు చేసి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తుంటారని పత్రంలో పేర్కొన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.