జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా: మమత (Mathura train accident| Mamata Banerjee| Ex-gratia| Rs five lakh| Goa express| Mewar Express)
Feedback Print Bookmark and Share
 
Mamata
FILE
మధుర వద్ద బుధవారం తెల్లవారుజామున సంభవించిన ఘోర రైలు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.5లక్షల నష్టపరిహారాన్ని అందజేయనున్నట్లు రైల్వేమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.

బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు గోవా ఎక్స్‌ప్రెస్- మేవాస్ ఎక్స్‌ప్రెస్‌లు ఢీకొనడంతో సంభవించిన ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకు ఆదేశించినట్లు ఆమె తెలిపారు.

ఇదిలా ఉంటే.. ఈ రైలు ప్రమాదం వల్ల పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో రైల్వేశాఖ ఆరు రైళ్ల దారిని మళ్లించగా, 5 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది.

మధురకు సమీపంలో ఆగి ఉన్న మేవార్ ఎక్స్‌ప్రెస్‌ను.. వేగంగా వచ్చిన గోవా క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఢీ కొన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలతో రంగంలోకి దిగారు. ఈ ప్రమాదంలో పది మంది మరణించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.