ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » జాతీయ » రాజస్థాన్‌లోని రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు (Rajasthan| Assembly| Vasundara Raje| Congress| News|National)
రాజస్థాన్‌లోని రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు
FILE
రాజస్థాన్‌లోని సామాజిక వర్గాల ప్రాబల్యం అధికంగా ఉన్న సలుంబర్, తోడాభీమ్ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ పాలిత ఈ రెండు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ ఏడో తేదీన ఉపఎన్నికలు జరుగుతాయి. ఈ నియోజక వర్గాల్లో పోటీచేసే అభ్యర్థులను కూడా కాంగ్రెస్ పార్టీ బుధవారం ఖరారు చేసింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల కారణంగా ఈ ఉపఎన్నికలు నిర్వహించడం అనివార్యమైంది. గుజ్జర్ల అసంతృప్తి సెగలతో పాటు స్థానిక సమస్యల కారణంగా ప్రజలు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పట్ల విశ్వాసం వ్యక్తం చేయడం లేదు.
అలాగే అధికారంలో ఉన్నప్పుడు వసుంధర రాజే అవలంబించిన విధి విధానాల వల్ల మరియు కేంద్ర అధిష్టానంతో రాజే విభేదించడంతో పార్టీలోని ఓ వర్గం ఆమెకు వ్యతిరేకంగా పావులు కదుపుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇంకా ఈ వర్గం కాంగ్రెస్‌కు మద్దతివ్వడం వసుంధర రాజేకు పెద్ద సవాల్‌గా మారింది. ఇకపోతే.. కాంగ్రెస్ పార్టీకూడా రాజస్థాన్‌లో అసమ్మతిని ఎదుర్కొంటోంది.